'దేవదాస్' కూడా అంతటి హ్యాపీ నెస్ ఇచ్చింది

Sunday,October 07,2018 - 11:10 by Z_CLU

లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున -నాని ‘దేవదాస్’ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ హ్యాపీ నెస్ ని ప్రేక్షకులతో పంచుకున్నాడు కింగ్ నాగార్జున.

నాగార్జున మాట్లాడుతూ ” ‘దేవదాస్’ ఫస్ట్ వీక్ 41 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి రెండో వారంలోకి అడుగుపెట్ట‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో నానికి థ్యాంక్స్ చెప్పాలి.. డాక్ట‌ర్ దాస్ గా అద్భుతంగా న‌టించాడు. సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నాకు నా కుటుంబానికి ఎప్పుడూ క‌లిసి వ‌స్తాయి. శివ సినిమా వ‌చ్చి అప్పుడే 29 ఏళ్లు గ‌డిచాయంటే ఇప్ప‌టికీ న‌మ్మ‌లేకపోతున్నా. అలాగే అప్ప‌ట్లో నేను న‌టించిన ‘నిన్నే పెళ్లాడ‌తా’ కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దేవీ థియేట‌ర్ లో అది కోటి రూపాయ‌లు వ‌సూలు చేసి రికార్డ్ సృష్టించింది.. ఆ తర్వాత ‘అల్లరి అల్లుడు’ సినిమా కూడా నన్ను మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసి మంచి హిట్ సాదించింది. మళ్ళీ దేవదాస్ కూడా నాకు అంతటి హ్యాపీ నెస్ అందించింది. ముఖ్యంగా ఫామిలీస్ బాగా వస్తున్నారని విన్నాను. దేవదాస్ ని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్ చెప్తున్నా. ” అన్నారు