ఎన్టీఆర్ చెప్పిన 'అరవింద సమేత' విశేషాలు

Sunday,October 07,2018 - 09:50 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కిన ‘అరవింద సమేత’ రిలీజ్ కి రెడి అయింది. విజయదశమి స్పెషల్ గా అక్టోబర్ 11 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడాడు ఎన్టీఆర్… ఆ విశేషాలు తారక్ మాటల్లోనే.

 

12 తర్వాత… ఇప్పటికి కుదిరింది

త్రివిక్రమ్ గారితో సినిమా చేయాలనేది నా పన్నెండేళ్ళ కోరిక.. చాలా సార్లు అనుకున్నాం కానీ ఎట్టకేలకు ఇప్పటికి కుదిరింది. ఆయనతో పనిచేయడం చాలా సంతృప్తి నిచ్చింది. ఈ సినిమాతో మా రిలేషన్షిప్ ఇంకా గట్టిపడింది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. ఎందుకో మా ఇద్దరికీ బాగా కుదిరింది. ఆయనతో మళ్ళీ పనిచేయాలని ఉంది.

 

డైరెక్టర్ సినిమా

సినిమా ప్రారంభం నుండి ఇది త్రివిక్రమ్ స్టైల్లో క్లాస్ గా ఉంటుందా… లేదా తారక్ స్టైల్ లో పక్కా మాస్ సినిమాగా ఉంటుందా..అనే డౌట్ అందరిలో ఉంది. నిజానికి ‘అరవింద సమేత’ త్రివిక్రమ్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్.. కొన్ని సినిమాలు చూసాక దర్శకుడే గుర్తొస్తాడు. ఈ సినిమా అదే కోవలోకి వస్తుంది. సినిమా చూసాక త్రివిక్రమ్ గారి మాటలు. సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. ఇట్స్ ఏ డైరెక్టర్ మూవీ.

బాగా కనెక్ట్ అవుతాయి

త్రివిక్రమ్ ఈ సినిమాను ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన రాసుకున్న సన్నివేశాలు.. పాత్రలు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతాయని భావిస్తున్నా.

 

ఎమోషనల్ గా ఉంటుంది

సినిమాలో అన్ని ఎలెమెంట్స్ ఉంటాయి.. కానీ ఎమోషనల్ డోస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మనసుని హత్తుకునేలా ఉంటాయి.

 

కో – ఇన్సిడెంట్

ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ తండ్రి చితికి నిప్పంటించే సీన్ లో నటించలేదు. అదేంటో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాన్న చనిపోవడం..  సినిమాలో కూడా తండ్రి చనిపోయే సీన్ ఉండటం. అన్నీ కో- ఇన్సిడెంట్స్ అనిపించాయి. పెనివిటి సాంగ్ కూడా నాన్న మరణం తర్వాతే షూట్ చేసాం. ఆ పాటకి నేను అమ్మ బాగా కనెక్ట్ అయిపోయాం. నాన్న ఉండి ఉంటే బాగుండేది.

 

ఆ సాంగ్ మిస్ అయ్యేవాణ్ణి

నా సినిమాలో అభిమానులు ఎక్కువగా మాస్ సాంగ్స్ ..ఫాస్ట్ బీట్ సాంగ్స్ బాగా ఇష్టపడతారు. నేను కూడా అలాగే ఆలోచించి ఉంటే ఈ సినిమాలో ‘పెనివిటి’ లాంటి అద్భుతమైన సాంగ్ ని మిస్ అయ్యేవాణ్ణి. ఆల్బం లో అదే నా ఫేవరెట్.