ఫ్రాన్స్‌లో విజ‌య్‌దేర‌కొండ‌

Monday,June 03,2019 - 06:39 by Z_CLU

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. ఫ్రాన్స్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యుల్ లో విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌హా ఇత‌ర నటీనటులపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేయనున్నారు.


రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో  రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.