"తొలిప్రేమ" సినిమా దర్శకుడితో నితిన్?

Monday,June 03,2019 - 03:07 by Z_CLU

త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేయబోతున్నాడు నితిన్. ఈ మూవీ తర్వాత నితిన్ చేయడానికి 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ అంతలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు నితిన్. అవును.. ప్రస్తుతం నడుస్తున్న డిస్కషన్స్ ప్రకారం, తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో నితిన్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

నితిన్-వెంకీ అట్లూరి కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్టే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం. ఎందుకంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు నితిన్ కు మరో 2 కమిట్ మెంట్స్ ఉన్నాయి.

కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ఛల్ మోహనరంగ వచ్చింది. దీంతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు.

ఆల్రెడీ ప్రకటించిన ఈ 2 సినిమాల తర్వాత వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇస్తాడా లేక ఏదైనా ఒక ప్రాజెక్టును పోస్ట్ పోన్ చేసి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.