ఇట్స్ అఫీషియల్.. పూరి డైరక్షన్ లో విజయ్

Monday,August 12,2019 - 03:51 by Z_CLU

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా లాక్ అయింది. రీసెంట్‌గా విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే ఊపులో ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా ఎనౌన్స్ చేశాడు ఈ డైనమిక్ డైరక్టర్.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తారు.

ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో అనే సినిమా కూడా చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే పూరితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు విజయ్ దేవరకొండ.