జూన్ రెండో వారంలో "టాక్సీవాలా" గ్రాండ్ రిలీజ్

Monday,May 21,2018 - 04:30 by Z_CLU

అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ… ఇప్పుడు టాక్సీవాలాతో తన స్టామినాను మరోసారి రుచిచూపించబోతున్నాడు. ఈమధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు టీజ‌ర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది.

జూన్ సెకెండ్ వీక్ లో టాక్సీవాలాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి.క్రియెష‌న్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు.

ఈ సినిమాలో విజయ్ మ్యానరిజమ్స్ యూత్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ మూవీకి హైలైట్స్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించారు. జూన్ సెకెండ్ వీక్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది టాక్సీవాలా.