టాక్సీవాలాగా మారుతున్న దేవరకొండ

Wednesday,October 24,2018 - 11:49 by Z_CLU

మొన్నటివరకు గీతగోవిందం సినిమాతో హల్ చల్ చేసిన విజయ్ దేవరకొండ, త్వరలోనే టాక్సీవాలాగా మారబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో, ఇక తనదైన స్టయిల్ లో ప్రచారం చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయబోతున్నారు.

నవంబర్ ఫస్ట్ వీక్ లో టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి నిర్ణయించారు. ఈ ఫంక్షన్ లో మరోసారి తన మెస్మరైజింగ్ స్పీచ్ తో ఆకట్టుకోవడానికి దేవరకొండ రెడీ అవుతున్నాడు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కంటే ముందే సినిమా అఫీషియల్ ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నారు.

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఎస్కేఎన్ నిర్మిస్తున్నాడు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే థియేట్రికల్ ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు.