షూటింగ్ అప్ డేట్స్

Monday,May 21,2018 - 05:18 by Z_CLU

సవ్యసాచి 

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ ‘సవ్యసాచి’ ఇటివలే అమెరికాలో ఓ షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది… నాగ చైతన్య, అదితి అగర్వాల్ అలాగే మిగతా ఆర్టిస్టులపై కొన్ని సీన్స్  తెరకెక్కించిన యూనిట్ చైతూ -అదితి లపై ఓ సాంగ్ కూడా షూట్ చేశారు. ప్రస్తుతం. ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకుంటున్న యూనిట్ జూన్ 1 నుండి లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో పదిరోజుల పాటు కొన్ని సీన్స్ షూట్ చేసి అలాగే ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై  రూపొందుతున్న ఈ సినిమాను జులై లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

 

శ్రీనివాస కళ్యాణం 

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మరో నాలుగు రోజులపాటు హైదరాబాద్ లో కొన్ని సీన్స్ తీసి జూన్ 1న అమలాపురం బయలుదేరనున్నారు యూనిట్. జూన్ 1 నుండి 20 వరకూ అమలాపురం లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో టోటల్ షూటింగ్ ఫినిష్ చేసుకొని ఆగస్ట్ 9 న థియేటర్స్ లోకి రానుంది ఈ సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నందిత శ్వేతా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మిక్కి జి.మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

వరుణ్ తేజ్ -సంకల్ప్ 

ఇటివలే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన మెగా హీరో వరుణ్ తేజ్ -సంకల్ప్ స్పేస్ మూవీ ప్రెజెంట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సెట్ లో వరుణ్ తేజ్ పై కొన్ని కీలక సీన్స్ షూట్ చేసిన ప్రస్తుతం నెలాఖరు వరకూ ఈ షెడ్యూల్ ను కంటిన్యూ చేయనున్నారు. ఈ షెడ్యూల్ ఫినిష్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకొని జులై నుండి మరో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

 

అల్లరి నరేష్ -గిరి మూవీ

అల్లరి నరేష్ హీరోగా గిరి దర్శకత్వంలో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్ లో  30 % షూట్ ఫినిష్ చేసిన యూనిట్ ఈ నెలాఖరు వరకూ షెడ్యూల్ ను కంటిన్యూ చేయనున్నారు. జూన్ నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.  ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

సాహో 

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాహో’ ప్రెజెంట్ అబుదభిలో షూట్ జరుపుకుంటుంది. కొందరు స్పెషల్ స్టంట్ కోరియోగ్రఫర్స్ నేతృత్వంలో ప్రభాస్  కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు యూనిట్. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరోవారం పాటు అబూదాబిలో షెడ్యూల్ జరగనుంది.

 

నాగార్జున -నాని మూవీ 

నాగార్జున – నాని మల్టీ స్టారర్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సారది స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో  నాగ్- నాని లతో  పాటు మరికొందరు ఆర్టిస్టులపై షూట్ చేస్తున్నారు యూనిట్.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ , రష్మిక మండన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు.