విజయ దేవరకొండ పొలిటికల్ ఇంపాక్ట్

Thursday,September 06,2018 - 05:20 by Z_CLU

విజయదేవరకొండ ‘నోట’ ట్రైలర్ రిలీజయింది. ఈ సినిమాలో విజయ దేవరకొండ మోస్ట్ అగ్రెసివ్ పాలిటీషియన్ లా కనిపించనున్నాడు. అయితే ఈ రోజు రిలీజైన 1: 39 సెకన్ల టీజర్ లో ఈ సినిమా స్టోరీని పెద్దగా రివీల్ చేయకపోయినా, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడో మచ్చుకు ప్రెజెంట్ చేశారు ఫిలిమ్ మేకర్స్.

తప్పనిసరి పరిస్థితుల్లో డమ్మీ CM గా పాలిటిక్స్ లోకి ఎంటరైన హీరో, ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు…? కామన్ మ్యాన్ నుండి సడెన్ గా CM అయిన ఒక యంగ్ స్టర్ ఎలాంటి అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుని, సిచ్యువేషన్ ని ఫేస్ చేశాడనేది సినిమాలో కీ పాయింట్ గా తెలుస్తుంది.

మెహరీన్ కౌర్ విజయ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకుడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. శ్యామ్ C.S. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.