వెంకటేష్ మహా ఇంటర్వ్యూ

Thursday,September 06,2018 - 06:12 by Z_CLU

ఈ నెల 7 న రిలీజవుతుంది C/O కంచెరపాలెం. రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా సక్సెస్ ఫుల్ అనిపించుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిలిమ్ మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ మహా ఇంటర్వ్యూ…

 

 నా సినిమా  జర్నీ…

సెట్ అసిస్టెంట్ గా కరియర్ స్టార్ట్ చేసిన నేను చాలా T.V. షో లలో చేశాను… అ తరవాత గ్రూప్ ఆఫ్ ఫిలిమ్ మేకర్స్ ని కలవడం జరిగింది. ఈ ప్రాసెస్ లో నేనో కథ రాసుకుని చాలా మంది ప్రొడ్యూసర్స్ ని కలిసి, చివరికి ఫ్రస్ట్రేట్ అయిపోయి, కంచెర పాలెం కి వెళ్ళిపోయా…

అలా జరిగింది…

కంచెరపాలెం లో ఉన్నన్ని రోజులు అక్కడ ఉండే వాళ్ళను అబ్జర్వ్ చేసేవాడిని… అక్కడ వాళ్లకు తెలీకుండా ఒక్కొక్కరి ఫోటో తీసుకుని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అడిగేవాడిని. తను ఆ పర్టికులర్ పర్సన్ గురించి స్టోరీ చెప్పేవాడు. అలా రాసుకున్న కథ కంచెరపాలెం.

టార్గెట్ ‘బిగ్’…

నాకెప్పుడూ ఒకే ఆలోచన. ఏ సినిమా చేసినా నా టార్గెట్ భారీ స్థాయిలో ఉంటుంది. ఏదో పొట్ట గడవడానికి సినిమాలు 4, 5 సినిమాలు చేయడానికి రాలేదు.

అపుడే అర్థమయింది…

సినిమా రాసేటప్పుడు గాని, తీసేటప్పుడు గాని ఈ సినిమా ఇంతగా అందరికీ నచ్చేస్తుందని అనిపించలేదు కానీ, ఎడిటింగ్ ప్రాసెస్ లో అనిపించింది.

సురేష్ బాబు గారితో…

నేను, ప్రొడ్యూసర్ ప్రవీణ వెళ్లి సురేష్ బాబు గారిని కలిశాం. ఆయన సినిమా చూసి ఓకె అనేశారు. అక్కడ క్రూ కి కూడా సినిమా చాలా నచ్చేసింది.

నెక్స్ట్ సినిమా ఇప్పుడే కాదు…

ఈ సినిమా రిలీజ్ తరవాత U.S. లో కోర్స్ చేద్దామనుకుంటున్నా. ఆ తరవాత నేను ఇంతకు ముందు రాసుకున్న కథలను సెట్స్ పైకి తీసుకువస్తా. ఏ సినిమా చేసినా కథలో డిఫెరెంట్ లేయర్స్ ఉండేలా చూసుకుంటా…

ఆ ఫీలింగే వేరు…

గతంలో నేను కథలు చెప్తుంటే నా రూమ్ మేట్స్ కూడా నా వైపు అదోలా చూసేవారు. అలాంటిది ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ ఫిలిమ్ మేకర్స్, ఈ సినిమా స్క్రిప్ట్ ని అప్రీషియేట్ చేస్తుంటే, చాలా హ్యాప్పీగా ఉంది.

కథ రాసుకున్నాకే…

ఎప్పుడైతే ఈ సినిమాకి ఇంతలా బజ్ క్రియేట్ అయిందో చాలా మంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది కానీ, నేనైతే ఇంకా ఏ సినిమాకి సంతకం చేయలేదు. ముందే కమిట్ అయితే వాళ్ళకోసం కథ రాసుకోవాల్సి వస్తుంది. అందుకే ఫస్ట్ కథ రాసుకున్నాకే కమిట్ మెంట్ అని ఫిక్సయ్యా…

టెన్షన్ ఏం లేదు…

ఇప్పటివరకు 15 సార్లు సినిమా ప్రదర్శించాం. రెస్పాన్స్ చూసి అలవాటు పడ్డాను కాబట్టి ఇప్పుడు రిలీజ్ కి ముందు ఉండే టెన్షన్ కానీ ఎగ్జైట్ మెంట్ కానీ ఏమీ  లేదు. ఈ సినిమా రిలీజై పోతే, నెక్స్ట్ చేసేదానిపై ఫోకస్ పెట్టొచ్చు అనే ఆలోచనే ఉంది.