గ్రాండ్ గా లాంచ్ అయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా

Thursday,October 18,2018 - 06:40 by Z_CLU

దసరా సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ అయింది విజయ్ దేవరకొండ కొత్త సినిమా. ఇంట్రెస్టింగ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రాశిఖన్నా తో పాటు మరో ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం విశేషం. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేస్తే, T. సుబ్బరామిరెడ్డి గారు క్లాప్ కొట్టారు. నాగ్ అశ్విన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.

రీసెంట్ బ్లాక్ బస్టర్ లవ్ ఎంటర్ టైనర్ ‘గీత గోవిందం’ తరవాత విజయ్ దేవరకొండ చేస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి K.A. వల్లభ ప్రొడ్యూసర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.