విజయ్ ఆంటోని యమన్ రిలీజ్ డేట్

Wednesday,February 15,2017 - 01:15 by Z_CLU

మొన్న గాక మొన్న రిలీజైన సైకలాజికల్ థ్రిల్లర్ భేతాళుడు ఫీవర్ ఇలా తగ్గిందో లేదో, మరో పొలిటికల్ థ్రిల్లర్ తో రెడీ అయిపోయాడు విజయ్ ఆంటోని. జీవ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 న రిలీజ్ కానుంది.

ఈసారి డ్యూయల్ రోల్ లో డిఫెరెంట్  ఇంపాక్ట్ ని క్రియేట్  చేయడానికి రెడీ అవుతున్న విజయ్ ఆంటోని, ఈ సినిమాకి కూడా తానే స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాలో మియా జార్జ్ హీరోయిన్ గా నటించింది.

బిచ్చగాడు, భేతాళుడు రేంజ్ లో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమా యూనిట్ మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పి బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి రెడీగా ఉంది.