లాయర్ గా మారనున్న అక్కినేని అమల

Wednesday,February 15,2017 - 03:08 by Z_CLU

అక్కినేని అమల ఈ సారి నల్లకోర్టు ధరించనుంది. C/o సైరాబాను టైటిల్ తో తెరకెక్కనున్న మళయాళ విమెన్ సెంట్రిక్ సినిమా లో కీ రోల్ ప్లే చేయనుంది. మంజు వారియర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అమల పవర్ ఫుల్ లాయర్ గా నటించడం మాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను హాట్ టాపిక్ అయింది.

 గతంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ లోను గ్రేస్ ఫుల్ పర్ఫామెన్స్ తో ఎట్రాక్ట్ చేసిన అమలకి టాలీవుడ్ లో బిగినింగ్ నుండే మంచి క్రేజ్ ఉంది. తన రేంజ్ క్యారెక్టర్స్  దొరకాలే కానీ తెలుగు లోను బిజీ కావాలనే ఆలోచనలో ఉన్న అమల ఆల్ రెడీ కమల హాసన్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. చాన్నాళ్ళ క్రితమే ఈ సినిమాని  అనౌన్స్ చేసిన సినిమా యూనిట్ మంచి టైం చూసుకుని సెట్స్ పైకి వచ్చే ఆలోచనలో ఉన్నారు.

 

amala-co-saira-banu

మరీ ఫాస్ట్ పేజ్ లో కాకపోయినా,  గుర్తుండిపోయే క్యారెక్టర్స్ లో మాత్రమే నటిస్తూ సక్సెస్ ఫుల్ గా కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న అమల, సెకండ్ ఇన్నింగ్స్ లోను స్టార్ ఇమేజ్ ని బ్యాగ్ లో వేసుకోవడం అంత కష్టమేమీ కాదు.