ఓవర్ సీస్ లో నేను లోకల్ మార్క్

Wednesday,February 15,2017 - 12:08 by Z_CLU

సింపుల్ లవ్ స్టోరీనే అయినా డిఫెరెంట్ ప్రెజెంటేషన్ సినిమాకి పెద్ద ప్లస్ అయి కూర్చుంది. ‘నేను లోకల్’ ఓవర్ సీస్ లో వన్ మిలియన్ మార్క్ ని ఈజీగా క్రాస్ అయిపోయింది. అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన నేను లోకల్, బోలెడన్నీ ఫన్ లోడెడ్ ఎలిమెంట్స్ తో ఓవర్ సీస్ లోను రిపీటెడ్ ఆడియెన్స్ ని రికార్డ్ చేసుకుంటుంది.

సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు సెట్ అయిన క్రేజ్, సినిమా రిలీజయ్యాక కూడా అదే టెంపోని మెయిన్ టైన్ చేయడం, బాక్సాఫీస్ వెయిట్ ని పెంచుతూనే ఉంది.

nenu-local-zee-cinemalu

దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్ అయితే, నాని, కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకి పెద్ద హైలెట్ గా నిలుస్తుంది. ఏది ఏమైనా ఓవర్ సీస్ లో ‘నేను లోకల్’ రీచ్ అయిన మిలియన్ మార్క్ బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్టాండర్డ్స్ ని మరింతగా పెంచేసింది.