శైలజారెడ్డి అల్లుడులో మెరుపు వీరుడు

Saturday,September 08,2018 - 01:06 by Z_CLU

మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య కెరీర్ లోనే ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది ఈ సినిమా. ఇందులో హైలెట్స్ ఏంటనే విషయంపై ఇప్పటికే మార్కెట్లో జోరుగా డిస్కషన్ సాగుతోంది. ఈ చర్చలో ఓ కామన్ పాయింట్ మాత్రం ఉంది. అదే వెన్నెల కిషోర్ ఎలిమెంట్.

అవును.. శైలజారెడ్డి అల్లుడు మూవీలో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ఉంది. సెకండాఫ్ లో ప్రీ-క్లయిమాక్స్ ముందు వచ్చే ఈ ఎపిసోడ్, టోటల్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని గట్టి నమ్మకంతో ఉంది యూనిట్. అదే కాన్ఫిడెన్స్ తో వెన్నెల కిషోర్ తో వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పించారు. అది కూడా కామెడీగా.

రీసెంట్ గా వస్తున్న సినిమాల్లో మెరుపువీరుడిలా మారాడు వెన్నెల కిషోర్. సరిగ్గా క్లయిమాక్స్ కు ముందు వచ్చి, తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అలా సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతెందుకు, రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ గీతగోవిందంలో కూడా వెన్నెల కిషోర్ కామెడీ బ్రహ్మాండంగా క్లిక్ అయింది. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడు సినిమాలో కూడా అదే మేజిక్ రిపీట్ కాబోతోంది. 13న థియేటర్లలోకి వస్తున్నాడు శైలజారెడ్డి అల్లుడు.