సెప్టెంబర్ 3వ వారంలో సామి మళ్లీ వస్తున్నాడు

Saturday,September 08,2018 - 01:37 by Z_CLU

‘సామి’ మళ్లీ వస్తున్నాడు. పదిహేనేళ్ల కిందట తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది ‘సామి’. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి స్క్వేర్’ను రూపొందించారు. ఈ చిత్రం తెలుగులో ‘సామి’ అనే టైటిల్‌తో సెప్టెంబర్ మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ హీరోగా, ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సామి’. శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్. ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు.

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు రెడీగా ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు.