నైజాంలో నాగచైతన్య రికార్డు

Saturday,September 08,2018 - 12:45 by Z_CLU

ప్రతి హీరోకు నైజాంలో ఓ రికార్డు ఉంటుంది. ఇప్పుడు నాగచైతన్య వంతు. రిలీజ్ కు ముందే శైలజారెడ్డి అల్లుడు సినిమాతో నైజాంలో రికార్డు సృష్టించాడు చైతూ. అవును.. శైలజారెడ్డి అల్లుడు సినిమా నైజాంలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. చైతూ కెరీర్ లోనే ఇది హయ్యస్ట్

వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా కోసం నైజాంలో ఏకంగా 210 స్క్రీన్స్ కేటాయించారు. వీటిలో హైదరాబాద్ లో 72 స్క్రీన్స్ ఇస్తే, మిగతావన్నీ జిల్లాల్లో ఉన్నాయి. రిలీజ్ నాటికి హైదరాబాద్ లో అదనంగా ఓ 10, జిల్లాల్లో అదనంగా మరో 30 స్క్రీన్లు యాడ్ అయ్యే అవకాశాలున్నాయి.

చైతూకు సంబంధించి ఇప్పటివరకు ఏ సినిమా నైజాంలో ఇంత భారీస్థాయిలో విడుదలకాలేదు. అటు ఓవర్సీస్ లో కూడా ఓ చిన్నపాటి రికార్డు సృష్టించాడు చైతూ. అమెరికా, కెనడా దేశాల్లో ఈ సినిమాను 170కి పైగా లొకేషన్లలో విడుదల చేస్తున్నారు. ఎల్ఏ తెలుగు అనే కంపెనీ ఈ సినిమాను యూఎస్ లో విడుదల చేస్తోంది.