మరికాసేపట్లో వెంకీ మామ టైటిల్ లోగో

Friday,April 05,2019 - 01:39 by Z_CLU

వెంకీ మామ ఫాస్ట్ ఫాస్ట్ గా ముస్తాబవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ఈ గ్యాప్ లో టైటిల్ లోగోను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఉగాది కానుకగా ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు వెంకీ మామ టైటిల్ లోగో రిలీజ్ కానుంది.

అవుట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం నుంచి సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య సరసన రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు నాటికి సినిమా పూర్తిచేసి దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.