కోలుకున్న గోపీచంద్.. త్వరలోనే మరో షెడ్యూల్

Friday,April 05,2019 - 03:30 by Z_CLU

2 నెలల కిందట జరిగిన షూటింగ్ లో గోపీచంద్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు గోపీచంద్. త్వరలోనే తన సినిమాకు సంబంధించి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాడు.

తిరు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు గోపీచంద్. రాజస్థాన్ లో జరిగిన ఈ మూవీ షూటింగ్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చేస్తూ గాయపడ్డాడు. అప్పట్నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్న గోపీచంద్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.

ఈ సినిమాలో గూఢచారిగా కనిపించబోతున్నాడట గోపీచంద్. అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఇది రాబోతోంది. అనీల్ సుంకర నిర్మాత.