అఖిల్ మూడో సినిమాపై సస్పెన్స్

Sunday,February 25,2018 - 11:00 by Z_CLU

అక్కినేని అఖిల్ మూడో సినిమాపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇటివలే ‘హలో’ సినిమాతో ఎంటర్టైన్ చేసిన అఖిల్ జనవరిలో తన మూడో సినిమా గురించి తెలియజేస్తానని ప్రకటించాడు. ఫిబ్రవరి వచ్చినా అఖిల్ ఆ సినిమాపై ఇంకా ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడంతో  అక్కినేని యంగ్ హీరో మూడో సినిమా ఎవరితో ఉండబోతుందనేది సస్పెన్స్ గా మారింది. మొన్నటి వరకూ అఖిల్ మూడో సినిమాకు కొరటాల శివ, సుకుమార్, పూరి వంటి స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించగా…ఇప్పుడు తొలి ప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి పేరు తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం తొలిప్రేమ అందించిన విజయంతో నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు వెంకీ. కథ పూర్తి కాగానే అఖిల్ కి నేరేట్ చేయబోతున్నాడని, ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడనే తెలుస్తుంది. మరి ఈ  వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.