విజయ్ దేవరకొండ 'ఏ మంత్రం వేశావే' రిలీజ్ డేట్

Sunday,February 25,2018 - 10:45 by Z_CLU

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఏ మంత్రం వేశావే’.   గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన శివానీసింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అబ్భత్ సమత్ సంగీతం అందిస్తున్నాడు.