బెట్టింగ్ రాయుడిగా వెంకీ?

Tuesday,October 15,2019 - 06:10 by Z_CLU

వెంకీ మామ సినిమా ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు విక్టరీ వెంకటేశ్. లిస్ట్ లో త్రివిక్రమ్, త్రినాథరావు నక్కిన, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు ఉన్నప్పటికీ ఎవ్వరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎట్టకేలకు వెంకీ మామ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా లాక్ అయింది. అది తరుణ్ భాస్కర్ సినిమా.

అవును.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకీ. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ సినిమాలో గుర్రపు పందాలపై బెట్టింగ్స్ కాసే వ్యక్తిగా వెంకటేష్ కనిపించబోతున్నాడట. అంతేకాదు, తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. సో.. వెంకీ-తరుణ్ భాస్కర్ సినిమా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోందనేది మాత్రం పక్కా.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం వెంకీ మామ రిలీజ్ డేట్ ను లాక్ చేసే పనిలో సురేష్ బాబు బిజీగా ఉన్నారు. అది ఫైనలైజ్ అయిన వెంటనే వెంకటేష్, తరుణ్ భాస్కర్ మూవీపై మరింత క్లారిటీ వస్తుంది.