పెళ్లిచూపులు దర్శకుడితో వెంకీ

Thursday,June 06,2019 - 12:44 by Z_CLU

ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్న వెంకటేశ్, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలు తీసిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ నటించబోతున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది

వెంకీ-తరుణ్ కాంబోలో సినిమా రాబోతున్న విషయాన్ని స్వయంగా నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు. ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్స్ సాగుతున్నాయని, ప్రాజెక్టు సెట్ అయితే తన సొంత బ్యానర్ పైనే సినిమా ఉంటుందని ప్రకటించారు సురేష్.

అయితే వెంకీ చేతిలో ఆల్రెడీ మరో సినిమా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వెంకీ మామ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయాలి. ఇంతలోనే తరుణ్ భాస్కర్ ప్రాజెక్టు కూడా తెరపైకి వచ్చింది. ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.