వెంకీ డైరెక్టర్ ఈ ముగ్గురిలో ఎవరు..?

Tuesday,January 24,2017 - 10:00 by Z_CLU

గురు సినిమా ప్యాకప్ అయిపోయింది. ఈ సినిమాతో వెంకీ 74 సినిమాలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు అప్పుడే వెంకీకి తన ల్యాండ్ మార్క్ సినిమా ప్రెజర్.. ఇటు ఫ్యాన్స్ లో డైరెక్టర్ ఎవరా అనే క్వశ్చన్స్ బిగిన్ అయిపోయాయి.

నిన్నా, మొన్నటి వరకు గురు సినిమా ప్యాకప్ కాగానే కిషోర్ తిరుమల, వెంకీ సెట్స్ పైకి వస్తాడనుకున్నారు. కానీ అనూహ్యంగా క్రిష్ తెరపైకి వచ్చేశాడు. బాలయ్య వందో చిత్రాన్ని టాలీవుడ్ హిస్టరీలో మిగిలేలా చేసిన క్రిష్, ఇపుడు వెంకీ 75 వ చిత్రాన్ని కూడా ఆలాగే ప్లాన్ చేస్తాడు అని మ్యాగ్జిమం ఫిక్స్ అయిపోయారు. అంతలో వెంకీ డైరెక్టర్స్ లిస్టులో ఇంకో కొత్త పేరు వినిపిస్తుంది.

అటు వెంకటేష్ కానీ, ఇటు పూరి జగన్నాథ్ కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు కానీ, పూరి, వెంకీ కాంబోలో ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి రాబోతుందనే టాక్ ఒకటి హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుంది. దీంతో వెంకీ 75 వ సినిమాపై అప్పుడే క్యూరాసిటీ రేజ్ అయిపోయింది.