రామ్ చరణ్ హీరోయిన్ మారింది...

Tuesday,January 24,2017 - 11:19 by Z_CLU

ఎంతవరకు నిజం తెలీదు కానీ చెర్రీ, సుకుమార్ హీరోయిన్ మారింది. నిన్నా మొన్నటివరకు అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఫిక్స్ అయిన సినిమా యూనిట్ సడెన్ గా డెసిషన్ మార్చుకుంది.

 

రైట్ టైం చూసుకుని సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకి హీరోయిన్ గా అనుపమ ఫిక్స్ అయి అవ్వగానే, అమ్మడూ హ్యాప్పీగా ఈ విషయాన్ని ట్వీట్ చేసి మరీ కన్ఫం చేసింది. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ మారింది అన్న న్యూస్ అనుపమ ఫ్యాన్స్ ని కాస్త డిజప్పాయింట్ చేస్తుంది.

anupama-parameswaran-cherry-movie-updates

ఈ విషయంలో ఇప్పటి వరకు సినిమా యూనిట్ నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, చెర్రీ సరసన మరో టాప్ హీరోయిన్ ని ట్రై చేస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్. ఈ కన్ఫ్యూజన్ కి తెర పడాలంటే సినిమా సెట్స్ పైకి రావాల్సిందే. అప్పటిదాకా రౌండ్స్ చేస్తున్న రూమర్స్ లో ఏవి వాస్తవాలో, ఏవి అవాస్తవాలో తేల్చుకోవడం కష్టమే.