రవి తేజ కి హీరోయిన్ ఫిక్స్

Tuesday,January 24,2017 - 09:13 by Z_CLU

మాస్ మహారాజ్ రవి తేజ, అనిల్ రవి పూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకి రవి తేజ సరసన ఛాన్స్ అందుకుంది మెహ్రీన్. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ లెటస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట.

mahreen

ఇక డిఫరెంట్ స్టోరీ తో రవి తేజ బ్లైండ్ క్యారెక్టర్ లో నటించబోయే ఈ సినిమాకు ముందుగా చాలా మంది హీరోయిన్స్ కి అనుకోని ఫైనల్ గా మెహ్రీన్ ని ఫిక్స్ చేశారట యూనిట్. మార్చ్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాలో రవి తేజ బ్లైండ్ క్యారెక్టర్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు యూనిట్. ఇప్పటికే ‘పటాస్’, సుప్రీమ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత అనిల్ రవి పూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమాతో మాస్ మహారాజ్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో? చూడాలి…