హాట్ టాపిక్: కమ్ముల డైరెక్షన్ లో సీనియర్ హీరో

Monday,June 29,2020 - 03:45 by Z_CLU

కొన్ని కాంబినేషన్లు అభిమానులతో పాటు ప్రేక్షకులనూ సప్రయిజ్ చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి హాట్ టాపిక్ అయింది. రెండు రోజులుగా విక్టరీ వెంకటేష్ తో శేఖర్ కమ్ముల సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఊహించని విధంగా తెరపైకొచ్చిన ఈ కాంబో అందర్ని సప్రయిజ్ చేసింది.

ప్రస్తుతం నాగచైతన్య , సాయి పల్లవి తో ‘లవ్ స్టోరీ’ సినిమా తీస్తున్న శేఖర్ కమ్ముల అదే నిర్మాతలతో నెక్స్ట్ ఓ సీనియర్ తో సినిమా చేయబోతున్నాడు. ఇటివలే ఆ విషయాన్ని ప్రకటించారు. కానీ ఆ సీనియర్ హీరో వెంకటేష్ అని, శేఖర్ కమ్ముల ఇటివలే వెంకీకి కథ చెప్పాడని ప్రచారం జరగడంతో ఈ కాంబో విషయంలో వెంకీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

అయితే ఈ కాంబోలో సినిమా నిజంగానే వస్తుందా లేక ఇది ఉత్తుత్తి ప్రచారమేనా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా విక్టరీ అభిమానులు మాత్రం ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.