జీ సినిమాలు - జూన్ 30

Monday,June 29,2020 - 08:34 by Z_CLU

ధీరుడు
నటీనటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్
ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
డైరెక్టర్ : భూపతి పాండ్యన్
ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్
రిలీజ్ డేట్ : 26 జూలై 2013
సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

================================

వసంతం
నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి
ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : విక్రమన్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 11 జూలై 2003
స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

=============================

ఒంగోలుగిత్త
నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013
రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==============================

చూడాలని ఉంది
నటీనటులు : చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధూళిపాళ్ళ, బ్రహ్మాజీ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ : అశ్విని దత్
రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1998
తన కూతురు ప్రియ, తనకిష్టం లేకుండా రామకృష్ణని పెళ్ళి చేసుకుందన్న కోపంతో తనపై ఎటాక్ చేయిస్తాడు మహేంద్ర. అయితే ఓ సందర్భంలో రామకృష్ణకి బులెట్ తగిలే సమయానికి ప్రియ అడ్డు పడుతుంది. దాంతో ప్రియ చనిపోతుంది. ఇదే సమయంలో రామకష్ణ, ప్రియ ల కొడుకును మహేంద్ర తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు ప్రియని చంపింది రామకృష్ణే అని హత్యానేరం మోపుతాడు. దాంతో జైలుకు వెళ్ళిన రామకృష్ణ మహేంద్ర దగ్గర ఉన్న తన కొడుకు కోసం తిరిగి వస్తాడు. అప్పుడే తనకు పద్మావతితో పరిచయమవుతుంది. చివరికి రామకృష్ణ, మహేంద్రకి ఎదురు నిలిచి కొడుకును ఎలా దక్కించు కున్నాడనేదే అసలు కథ.

============================

యోగి
నటీనటులు : ప్రభాస్, నయన తార
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017
ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.