కిస్ సీన్.. నో అంటున్న హీరోయిన్స్

Monday,June 29,2020 - 01:50 by Z_CLU

లిప్ కిస్ అనగానే హీరోయిన్లు రెండు గ్రూపులుగా విడిపోతారు. ముద్దులకు ఓకే అనే బ్యాచ్ ఒకటైతే.. స్ట్రిక్ట్ గా నో చెప్పే బ్యాచ్ ఇంకోటి. అయితే ఇప్పుడు హీరోయిన్లందరిదీ ఒకటే మాట. #NoLipLock. దీనికి కారణం కరోనా.

అన్ని జాగ్రత్తలు తీసుకొని, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నప్పటికీ వైరస్ సోకుతున్న రోజులివి. ఇలాంటి టైమ్ లో ముద్దు సీన్ అంటే బిగ్గెస్ట్ రిస్క్ అదే అవుతుంది.

అందుకే హీరోయిన్లంతా లిప్ కిస్సులకు నో చెబుతున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఆల్రెడీ ఒప్పుకున్న హీరోయిన్లు కూడా నిర్మాతలతో మాట్లాడి అలాంటి సీన్లు లేకుండా ప్లాన్ చేస్తున్నారు.

రీసెంట్ గా దీనిపై హాట్ లేడీ రెజీనా కూడా రియాక్ట్ అయింది. గతంలో సిల్వర్ స్క్రీన్ పై లిప్ కిస్సులు పెట్టడానికి మొహమాటపడని ఈ హీరోయిన్.. ఇప్పుడు మాత్రం కరోనా పూర్తిగా తగ్గేవరకు అలాంటి సీన్స్ కు దూరమని ప్రకటించింది.

ఇలా హీరోయిన్లంతా ఇప్పుడు ముద్దు సీన్లకు దూరంగా ఉంటున్నారు.

రెజీనా “నక్షత్రం” ఫుల్ మూవీ