ఘనంగా వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్ళి

Saturday,March 23,2019 - 04:09 by Z_CLU

ఏ మాత్రం ఆర్భాటాలు లేకుండా జరిగింది వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్ళి. అలాగని సింపుల్ గా జరిపించేశారా అంటే కాదు. గ్రాండ్ గా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ అది. జైపూర్ లోని ఓ కాస్ట్ లీ రిసార్ట్ లో జరిగింది. అయితే ఈ వేడుకలు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అటెండ్ అయ్యాడు.

దగ్గుబాటు ఫ్యామిలీ ఈ పెళ్లి వేడుకలను మ్యాగ్జిమం మీడియా హడావిడికి దూరంగా ఉండేలా ప్లాన్ చేయడంతో పెద్దగా ఇన్ఫర్మేషన్ రివీల్ కాకపోయినా, ఈ పెళ్ళిలో సల్మాన్ ఖాన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో. ఈ పెళ్ళి మరింత అట్రాక్షన్ ని గ్రాబ్ చేసుకుంటుంది. పెళ్ళికి నాగ చైతన్య, సమంతా లతో పాటు రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యాడు.

హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్, ఆశ్రిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో గత నెల 6 వ తేదీన వెంకటేష్ ఇంట్లో ఘనంగా నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. ప్రస్తుతం జైపూర్ లో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న దగ్గుబాటి ఫ్యామిలీ, త్వరలో హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు.