అర్జున్ సురవరం రిలీజ్ డేట్ మారింది

Saturday,March 23,2019 - 03:07 by Z_CLU

మార్చి 29 న రిలీజ్ కావాల్సిన అర్జున్ సురవరం రిలీజ్ డేట్ మారింది. ఎగ్జాక్ట్ రీజన్స్ తెలీదు కానీ మే డే సందర్భంగా మే 1 న సినిమా రిలీజవుతుందని ప్రకటించారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ డేట్ దొరికిన ఈ గ్యాప్ లో మరింత్ అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేసి వైడ్ రేంజ్ లో సినిమాని రీచ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ‘

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన 2 సాంగ్స్ కి సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు నిఖిల్ సినిమా డెఫ్ఫినెట్ గా డిఫెరెంట్ గా ఉంటుందనే న్యాచురల్ గానే సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లా నటించాడు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి స్యామ్ సి.యస్. మ్యూజిక్ కంపోజ్ చేశాడు. T. సంతోష్ సినిమాకి డైరెక్టర్. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది.