Allu Arjun Pushpa Release - త్వరలోనే అప్ డేట్!

Saturday,June 26,2021 - 02:11 by Z_CLU

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ రిలీజ్ ఎప్పుడో తెలియక ఎనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి సినిమా థియేటర్స్ లోకి వచ్చేది. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ వాయిదా పడటం, థియేటర్స్ క్లోజ్ చేయడం వల్ల రిలీజ్ వాయిదా పడింది. అయితే సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్న మేకర్స్ త్వరలోనే పుష్ప పార్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

పుష్ప పార్ట్ 1 ను అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జులై మొదటి వారంలో రిలీజ్ డేట్ ను ప్రకటించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. బన్నీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో పుష్ప రాజ్ గా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

ఇప్పటికే పుష్ప రాజ్ ఇంట్రో టీజర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన సుకుమార్ ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. జులై నుండి సినిమా మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది. సెప్టెంబర్ కల్లా టోటల్ షూట్ ఫినిష్ చేసేలా టీం పని చేస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అనిపించేలా పుష్ప ని తీర్చి దిద్దుతున్నాడు సుక్కు. బన్నీ -సుక్కు కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న పుష్ప నాలుగు భాషల్లో విడుదల కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics