వరుణ్ తేజ్ సరసన కొత్త హీరోయిన్ ?

Sunday,April 01,2018 - 11:09 by Z_CLU

‘ఫిదా’,’తొలి ప్రేమ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. సంకల్ప రెడ్డి డైరెక్షన్ లో స్పేస్ మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా అదితి రావు హైదరి ని తీసుకుంటారనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈసినిమా కోసం కొత్త హీరోయిన్ వేటలో పడ్డారట యూనిట్. ఇప్పటికే ఈ సినిమా కోసం కొందరిని ఆడిషన్స్ చేసారని త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ప్రకటించనున్నారని సమాచారం.

సినిమాలో ఆస్ట్రోనాట్ గా కనిపించడం కోసం వరుణ్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. వై.రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది.