నెక్స్ట్ సినిమాపై సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు

Sunday,April 01,2018 - 10:01 by Z_CLU

‘రంగస్థలం’ తో గ్రాండ్ హిట్ అందుకున్న సుకుమార్ తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసాడు. నిన్న మొన్నటి వరకూ సుకుమార్ నెక్స్ట్ సినిమా ఆ హీరో తో ఉంటుంది ఈ హీరోతో ఉంటుంది అంటూ వినిపించిన మాటల్ని కొట్టిపడేసాడు సుక్కు. ఇటివలే మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం రంగస్థలం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ తో కొన్ని రోజులు గడపాలనుకుంటున్నానని, నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఏం ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.

మళ్ళీ మైత్రి లోనే సినిమా చేస్తున్నా అని కానీ హీరో ఎవరన్నది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదని చెప్పాడు. ఇక చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలనీ ఉందని.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే దర్శకుడిగా గోల్ రీచ్ అయినట్టే అని తెలిపాడు. సో సుక్కు నెక్స్ట్ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.