మెగాహీరోల మధ్య బాక్సాఫీస్ వార్

Thursday,January 04,2018 - 02:47 by Z_CLU

ఇప్పటివరకు మెగా హీరోల సినిమాలు రెండు ఒకేసారి విడుదలైన దాఖలాలు చరిత్రలో లేవు. ఒకే కాంపౌండ్ లో ఉంటున్న ఈ హీరోలు డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకొని థియేటర్లలోకి వస్తారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరు మెగాహీరోల మధ్య పోటీతప్పేలా లేదు. వాళ్లే సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్.

వీళ్లిద్దరు నటించిన సినిమాలు ఇప్పుడు ఒకేసారి విడుదలకాబోతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. అదే రోజు సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటలిజెంట్ సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించాడు నిర్మాత సి.కల్యాణ్. దీంతో మెగా హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ షురూ అయింది.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తొలిప్రేమ సినిమా దాదాపు పూర్తయింది. కాస్త ప్యాచ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అటు ఇంటలిజెంట్ మూవీకి సంబంధించి ప్రస్తుతం క్లయిమాక్స్ షూట్ నడుస్తోంది. తర్వాత మరో 2 పాటల షూటింగ్ పెండింగ్ ఉంది.