‘నా పేరు సూర్య’ ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ ఇంటర్వ్యూ...

Thursday,January 04,2018 - 04:29 by Z_CLU

న్యూ ఇయర్ ఫీస్ట్ గా రిలీజైన అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 29 గంటల్లో కోటి మందికి పైగా చూసిన ఈ ఇంపాక్ట్ రీచ్ ని చూస్తుంటే, ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయి ఉందో తెలుస్తుంది. ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ సక్సెస్ ఫుల్ గా రీచ్ అయిన సందర్భంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ లగడపాటి పై శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఆ చిట్ చాట్ మీకోసం…   

 

‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ సక్సెస్…

మా సినిమా ‘నా పేరు సూర్య’ సినిమాపై గాని బన్ని పై గాని మీరు చూపించిన ప్రేమకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీడం లేదు. నిజం చెప్పాలంటే మా దగ్గర మాటల్లేవు.. 29 గంటల్లో కోటి మందికి పైగా ఈ ఫస్ట్ ఇంపాక్ట్ ని చూడటం మామూలు విషయం కాదు…

ప్రత్యక్షంగా ఇదే ఫస్ట్ టైమ్..

బన్ని ప్యాన్ ఇండియా స్టార్ అన్న విషయం తెలుసు.. ఫ్యాన్స్ లో ఆయనకున్న క్రేజ్ కూడా తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ ప్రత్యక్షంగా చూస్తున్నాను.

 

అందుకే ఇంత ఇంపాక్ట్…

ఈ ఫస్ట్ ఇంపాక్ట్ లో మోస్ట్ ఇంప్రెసివ్ బన్ని బాడీ లాంగ్వేజ్ అయితే, ఈ రేంజ్ లో రీచ్ పెరగడానికి రీజన్, ఈ సినిమాకి పని చేస్తున్న టెక్నీషియన్స్. బన్ని చూజ్ చేసుకున్న టీమ్ ఎఫర్ట్, జస్ట్ ఫస్ట్ ఇంపాక్ట్ లో కాదు మొత్తం సినిమాలో కనిపిస్తుంది.

మరోసారి ప్రూఫ్ అవుతుంది…

బాహుబలి సినిమాతో ఇండియన్ మూవీ స్టామినా ఏ రేంజ్ లో ఎలివేట్ అయిందో, ఈ సినిమాకి కూడా అంతే  గౌరవం దక్కుతుందని, బన్ని ఫ్యాన్స్ గర్వించదగ్గ సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను…

ఆ మూడు సినిమాల పవర్…

రేసుగుర్రం, కిక్, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలకు స్టోరీ రాసిన వక్కంతం వంశీ గారు ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆ మూడు సినిమాలు కలిపితే ఎంత పవర్ ఉంటుందో, ఈ సినిమాలో అంత పవర్ ఉంటుంది.

వేరే ఆలోచన లేదు

సాధారణంగా ఇంటర్వెల్ తోనే సినిమా హిట్టవ్వాలి అనుకుంటూ ఉంటా… కానీ ఫస్ట్ ఇంపాక్ట్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఇక సినిమా గురించి వేరే ఆలోచన వద్దు, బ్లాక్ బస్టర్ గ్యారంటీ…

టెక్నికల్ టీమ్ పెద్ద ఎసెట్…

బాహుబలి సినిమా ప్రొడక్షన్ ని మ్యానేజ్ చేసిన యోగానంద్ గారు, D.O.P. రాజీవ్ రవి గారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్స్. దానికి తోడు బన్ని వాసు, నాగబాబు గారి సపోర్ట్ తో సినిమా మీ ముందుకు వస్తుంది.

 

స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు…

బన్నికి టాలీవుడ్ లోనే కాదు నేషన్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు వేరే ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఈ సినిమా ఆ క్రేజ్ ని రెండింతలు చేయడం గ్యారంటీ.

అమీర్ ఖాన్ తరవాత…

బన్ని కరియర్ స్కేల్ గమనిస్తే సినిమా సినిమాకి ఎదుగుతూనే ఉన్నారు. తన హార్డ్ వర్క్ కానీ, తన సినిమా చాయిస్ కానీ సినిమా పట్ల ఆయనకుండే డెడికేషన్ చూస్తుంటే, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ తరవాత అల్లు అర్జున్ ఆ హైట్స్ కి రీచ్ అవుతారనడానికి ఏ మాత్రం సందేహం లేదు.

రిలీజ్ డేట్ లో చేంజెస్ ఉండవు…

సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. మార్చి కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ఏప్రియర్ 27 న సినిమా కంపల్సరీగా రిలీజ్ అవుతుంది.

4 సెగ్మెంట్స్ హైలెట్ అవుతాయి…

ఈ సినిమాలో జస్ట్ ప్యాట్రియాట్రిక్ సెగ్మెంట్ ఒకటే కాదు,  రొమాన్స్, ఫ్యామిలీ, సొసైటీ.. ఇలా 4 సెగ్మెంట్స్ లతో సినిమా స్ట్రాంగ్ ఇమోషన్స్ తో నడుస్తుంది. ఈ రోజుల్లో యంగ్ స్టర్స్ ఒకసారి కమిట్ అయితే, ఆ కమిట్ మెంట్ ఎంత కట్టుబడి ఉంటారనేది సినిమాలో కనిపిస్తుంది.

నాకా ఆలోచన ఉంది కానీ…

నాకు సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ కి బాహుబలి లాగే అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేద్దామనే ఉంది కానీ, బన్ని కరియర్ ప్లానింగ్ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఇంత మంచి స్టార్ డబ్బింగ్ సినిమాతో లాంచ్ అవ్వడమన్నది ఆలోచించాల్సిన విషయం. ఆల్రెడీ బన్నికి తెలుగు, తమిళ్ బైలింగ్వల్ చేయాలని ఆలోచన ఉంది… అందుకే మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలని ప్రస్తుతానికయితే ఆలోచన లేదు.

ఇంకా 40 రోజులు…

ఆల్మోస్ట్ 70%  షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా 30% కంప్లీట్ అవ్వాల్సి ఉంది.  మరో 40 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుని తొందరలో ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్నాం. మార్చి 1 వీక్ కల్లా ఫస్ట్ కాపీ వచ్చేయాలి అనుకుంటున్నాం.

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్…

ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్ కిచ్చ ఫ్రమ్ బ్యాంకాక్ తో పాటు పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ గారు రవివర్మ గారు.. నలుగురు మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేశారు. సినిమాలో ఉండబోయే ఇమోషనల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇండియన్ సినిమా హిస్టరీలో బెంచ్ మార్క్స్ లా నిలవడం ఖాయం. మీకు టీజర్ లో జస్ట్ మూడు యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తాయి. ఇంకా పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్ ఫస్ట్ ఇంపాక్ట్ లో లేదు.

టీజర్ అయితే మర్చిపోతారు….

రొటీన్ గా టీజర్ లా రిలీజ్ చేసి ఉంటే కొన్ని రోజులు గుర్తుపెట్టుకుని మర్చిపోతారు, అలా కాకుండా ఈ వీడియోతో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం. అలాగే చేశాం… నాకు తెలిసి ఇప్పటి నుండి టీజర్స్ ప్లేస్ లో ఇంపాక్ట్స్ రిలీజ్ అవుతాయి.

ఇక మర్చిపోండి…

అందరిలో వక్కంతం వంశీకి ఇది ఫస్ట్ సినిమా, ఇంత పెద్ద వెంచర్ ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో అని ఒక అనుమానం ఉంది, ఈ ఇంపాక్ట్ తో ఇక అదంతా మర్చిపోండి. ఈ సినిమా తరవాత వక్కంతం వంశీ గారు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ లో ఉంటారు…