రేపటి నుండే వరుణ్ తేజ్ కొత్త సినిమా

Sunday,July 23,2017 - 08:08 by Z_CLU

వరుణ్ తేజ్ కొత్త సినిమా రేపటి నుండే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్  జూన్ లో లాంచ్ అయింది. రాశిఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. BVSN  ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఏ ఇమేజ్ లేకుండా ఉండటమే సరైన ఇంప్రెషన్ అని బిలీవ్ చేసే వరుణ్ తేజ్, ఫిదా సినిమాతో పక్కా లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రేపటి నుండి బిగిన్ కానున్న ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్ పవర్ ప్యాక్డ్  లవర్ బాయ్ గా కనిపించాననున్నాడని తెలుస్తుంది.