కన్నడ రీమేక్ లో NTR

Sunday,July 23,2017 - 05:29 by Z_CLU

NTR జై లవకుశ రిలీజ్ కి ముందే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో NTR మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ఇంటరెస్టింగ్ బజ్ సినీ టౌన్ లో చక్కర్లు కొడుతుంది.

జై లవకుశ తరవాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇంకా అనౌన్స్ చేయని NTR ఈ సినిమా తరవాత కన్నడ బ్లాక్ బస్టర్ ‘రాజ కుమార’ పై మనసు పారేసుకున్నాడని, యంగ్ టైగర్ ఈ సినిమాని  రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడనే టాక్ టాలీవుడ్ లో చిన్న సైజు సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.

ఈ విషయం పై ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే జరగలేదు కానీ, ఉన్నట్టుండి సోషల్ మీడియాలో క్రియేట్ అయిన ఈ న్యూస్, అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందో లేక జస్ట్ గాసిప్ లా మిగిలిపోనుందో చూడాలి.