మళ్ళీ కమ్ముల హీరోయిన్ పైనే దృష్టి

Sunday,July 23,2017 - 08:49 by Z_CLU

ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ‘మహానుభావుడు’ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు శర్వానంద్. మరోవైపు ఆగష్టులో సెట్స్ పైకి రానున్న సుధీర్ వర్మ సినిమా ప్రీ ప్రొడక్షన్ పై కూడా ఓ కన్నేసి ఉంచాడు శర్వానంద్. అయితే ఈ సినిమాలో శర్వ సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని ప్రిఫర్ చేస్తున్నాడట.

ఆ మధ్య శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాలో ‘రూప’ గా నటించిన కమలినీ ముఖర్జీతో ‘గమ్యం’ సినిమా చేశాడు. శేఖర్ కమ్ముల హీరోయిన్స్ పై మనసు పారేసుకోని ప్రేక్షకుడు ఉండడు అది వెరీ న్యాచురల్. కానీ శర్వానంద్ కూడా అదే క్యాటగిరీ లోకి వస్తాడని తెలుస్తుంది.

మరి శర్వానంద్ కోరిక మేరకు సినిమా యూనిట్ సాయి పల్లవిని సంప్రదించిందా లేదా..? సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.