లైన్ క్లియర్ చేసుకున్న ఫిదా

Friday,July 14,2017 - 03:32 by Z_CLU

వరుణ్ తేజ్ ‘ఫిదా’ సెన్సార్ క్లియరయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది. జూలై 21 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సాయి పల్లవి  హీరోయిన్ గా నటించింది.

ఇంటరెస్టింగ్ టీజర్స్, ట్రేలర్ తో ఇప్పటికే సినిమా సక్సెస్ కి కావాల్సినంత ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయిన సినిమా యూనిట్, వరుణ్ తేజ్ కరియర్ లోనే  ‘ఫిదా’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి శక్తికాంత్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.