మెగాస్టార్ ఉయ్యాలవాడ హీరోయిన్ ఫిక్సయింది

Friday,July 14,2017 - 02:04 by Z_CLU

మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ హీరోయిన్ ఫిక్స్ అయింది. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి హీరోయిన్ ని ఫిక్స్ చేసేసుకుంది సినిమా యూనిట్. నిన్నటి మొన్నటి వరకు చాలా మంది హీరోయిన్స్ పేరు వినిపించిన ఈ స్పేస్ లో నయనతార ఆల్ మోస్ట్ ఫిక్సయినట్టే అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్.

మెగాస్టార్ సరసన నయనతార అనగానే న్యాచురల్ గానే టాలీవుడ్ లో మెగా వైబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి. ప్రస్తుతం బడా బడా వెంచర్స్ తోపాటు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇప్పటి వరకు చిరుతో జత కట్టలేదు. ఖైదీ నం 150 లో ట్రై చేసినా కుదరలేదు. అందుకే నయన్ కూడా ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఈ చాన్స్ మిస్సయ్యే చాన్సే లేదు.

 

కొణిదెల  ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఫ్రీడమ్ ఫైటర్ లా కనిపించనున్నాడు. ఇంకో నెల రోజుల్లో లాంచ్ కానున్న ఈ సినిమా కోసం ఫాస్ట్ పేజ్ లో ప్రిపేర్ అవుతుంది సినిమా యూనిట్.