VakeelSaab Motion Poster - రక్షకుడు-శిక్షకుడు

Wednesday,September 02,2020 - 10:17 by Z_CLU

పవర్ స్టార్ Pawan Kalyan Birthday సందర్భంగా వకీల్ సాబ్ సినిమా నుంచి మోస్ట్ ఎవెయిటింగ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. లాయర్ గెటప్ లో ఉన్న పవన్ కల్యాణ్ స్టిల్ అదిరిపోయింది.

VakeelSaab Motion Poster లో పవన్ ఓ చేతిలో కర్ర పట్టుకొని, మరో చేతిలో లా పుస్తకం పట్టుకొని స్టయిల్ గా నిల్చొన్నాడు. వకీల్ సాబ్ లో పవన్ లుక్ అందరికీ తెలిసిందే. కానీ ఆ స్టయిల్ మాత్రం అందర్నీ కొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. కేవలం న్యాయాన్ని రక్షించడమే కాకుండా.. దుష్టుల్ని శిక్షించే వ్యక్తిగా కూడా పవన్ ఇందులో కనిపించబోతున్నాడు.

టీజర్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సత్యమేవ జయతే అనే లిరిక్స్ తో వచ్చే ఆర్ఆర్ టీజర్ కు సరిగ్గా సరిపోయింది.

వేణుశ్రీరామ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. నివేత థామస్ (Nivetha Thomas), అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించి త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది.