HBDPawanKalyan - జీ సినిమాలు స్పెషల్

Wednesday,September 02,2020 - 09:01 by Z_CLU

పవర్ స్టార్… ఈ పేరు వింటే చాలు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆటోమేటిక్ గా గుర్తుకు వచ్చేస్తుంది. చిన్న చిరునవ్వు తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం పవన్ కే సాధ్యం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుండి బిగిన్ అయితే, అజ్ఞాతవాసి వరకు సినిమా సినిమాకి ఫ్యాన్స్ కి దగ్గరైన పవన్ కళ్యాణ్ ఈ రోజు తన 49వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

 

1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన Pawan Kalyan తరవాత జస్ట్ నాలుగేళ్ళలో వరసగా గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు సినిమాలతో యూత్ ని కంప్లీట్ గా మెస్మరైజ్ చేసి పవర్ స్టార్ లా రేజ్ అయ్యాడు.

పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడ్ని బద్రి సినిమాతో ఇంట్రడ్యూస్ చేసింది కూడా పవన్ కళ్యాణే. 2000లో రిలీజైన ఈ సినిమా పవన్ స్టామినాని ఎలివేట్ చేసింది. ఈ డెకేడ్ లో రిలీజైన ఖుషి (Kushi), గుడుంబా శంకర్, బాలు (Balu), బంగారం, అన్నవరం, జల్సా (Jalsa) లాంటి సినిమాలు పవర్ స్టార్ కి ఆల్ రెడీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ని రెట్టింపు చేశాయి.

అన్నవరం (Annavaram) Full Movie

2012 లో రిలీజైన గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ ని ట్రెండ్ సెట్టర్ అని ప్రూఫ్ చేస్తే, అత్తారింటికి దారేది సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేసింది. అజ్ఞాతవాసి సినిమా కూడా పవన్ స్టామినాను వసూళ్ల రూపంలో బయటపెట్టింది.

ప్రస్తుతం ఈ హీరో Vakeel Saab తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, రీఎంట్రీలో ఫుల్ స్పీడ్ పెంచాడు Pawan Kalyan. క్రిష్ తో ఓ సినిమా, హరీష్ శంకర్ తో మరో సినిమా కూడా లైన్లో పెట్టారు. సో.. ఈ బర్త్ డే పవన్ కల్యాణ్ అభిమానులకు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇకపై ఏడాదికో మూవీ చూడబోతున్నారు.

Happy Birth Day POWER STAR PAWAN KALYAN