Pawan Birthday Spl - PSPK29 ఎనౌన్స్ మెంట్

Wednesday,September 02,2020 - 12:30 by Z_CLU

 

కొన్ని రోజులుగా Pawan, Surender Reddy కాంబినేషన్ లో సినిమా రానుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘SyeRaa’ తో మెగాస్టార్ ను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి ఇప్పుడు పవన్ ను కూడా డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. నేడు Pawan Birthday ను సందర్భంగా ఈ కాంబోను అఫీషియల్ గా ప్రకటించారు. నిర్మాత రామ్ తాళ్ళూరి, సురేందర్ రెడ్డి ఇద్దరూ ఓ పోస్టర్ ద్వారా పవన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కానీ అందులో సినిమా రానుందని మాత్రం చెప్పలేదు. విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్తూ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చారు.

ఈ కాంబినేషన్ సినిమాను SRT Entertainments బ్యానర్ పై Ram Talluri నిర్మించనున్నాడు. పవన్ కమిట్ అయిన సినిమాలు పూర్తవ్వగానే సురేందర్ రెడ్డి తో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు అఖిల్ తో ఓ సినిమా చేసి పవన్ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెడతాడు సురేందర్.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరో సందర్భంలో ఈ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయనున్నారు మేకర్స్.