ఈ హీరోయిన్స్ వయసెంతో తెలుసా...?

Thursday,January 23,2020 - 12:02 by Z_CLU

సిల్వర్ స్క్రీన్ పై హీరోలకుండే క్రేజ్ హీరోలదే. హీరోయిన్స్ కి ఉండే క్రేజ్ హీరోయిన్స్ దే… ఓ సక్సెస్ పడి ఫ్యాన్స్ మైండ్ లో ఫిక్సవ్వాలి కానీ ఏళ్ల తరబడి ఫ్యాన్స్ గుండెల్లో సెటిలైపోతారు ముద్దుగుమ్మలు. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ హీరోయిన్స్ వయసెంతో ఓ లుక్కేసేయండి…

త్రిష : ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో 2003 లో తెలుగు సినిమాకి పరిచయం అయింది. ఇప్పటికీ త్రిష అంటే ఆడియెన్స్ లో క్రేజ్ తగ్గలేదు. 36 ఏళ్ళొచ్చినా త్రిష లుక్స్ లో కూడా ఏ మాత్రం చేంజెస్ రాలేదు.

అనుష్క :  హీరోలతో పోటీగా లుక్స్ విషయంలో, క్యారెక్టర్స్ విషయంలో వేరియేషన్స్ మెయిన్ టైన్ చేస్తుంది అనుష్క. ‘సైజ్ జీరో’ లాంటి సినిమాలు చేయాలన్నా అది కేవలం అనుష్క వల్లే పాసిబుల్ అవుతుంది. అల్ట్రా గ్లామరస్ క్యారెక్టర్స్ లో యూత్ ని మెస్మరైజ్ చేయాలన్నా, బాహుబలి సినిమాలో ‘దేవసేన’ లా డీ గ్లామర్ రోల్ లో కనిపించాలన్నా అది కేవలం అనుష్కకే సాధ్యం. ఈ ముద్దుగుమ్మ వయసు అక్షరాలా 37.

కాజల్ అగర్వాల్ : తెలుగు సినిమాకి పరిచయమై ఏకంగా 11 ఏళ్ళు. అయినా కాజల్ అగర్వాల్ ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా కొత్తగానే అనిపిస్తుంది. 34 ఏళ్ళ వయసులో కూడా యంగ్ గర్ల్ లుక్స్ లో ఎప్పటికపుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది ఈ పంచదార బొమ్మ.

సమంతా : 32 ఏళ్ల వయసు. రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుంది సమంతా. కానీ ఈ మలయాళీ ముద్దుగుమ్మ  మొదటి సినిమాతో  చేసిన మాయ ఇంకా యూత్ లో ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అఫ్కోర్స్ సమంతా అందంలో  కూడా ఏ మాత్రం మార్పు లేదు.

తమన్నా :  టాలీవుడ్ లో మ్యాగ్జిమం హైట్స్ చూసిన హీరోయిన్స్ లో తమన్నా పేరు కూడా ఉంటుంది. గ్లామర్ కి గ్లామర్, పర్ఫామెన్స్ కి పర్ఫామెన్స్… ఓ రకంగా చెప్పాలంటే తమన్నా ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజ్. వయసు 29.

రకుల్ ప్రీత్ సింగ్ : హీరోయిన్ కాస్త ప్రిటీ లుక్స్ లో ఉండాలి అనగానే మేకర్స్ మైండ్ లో పడే బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోయిన్స్ తో నటించి, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ వయసు 29.

కీర్తి సురేష్ : మొదట్లో మరీ హోమ్లీ గా ఉందనిపించినా కీర్తి సురేష్ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయిన కీర్తి సురేష్ వయసు 26.

సాయి పల్లవి : ఎంత హైబ్రిడ్ పిల్ల కాకపోతే మొదటి సినిమాకే ఈ స్థాయిలో ఫాలోయింగా…? చాలా తక్కువ మంది హీరోయిన్స్ సాయి పల్లవి తరహాలో జెట్ స్పీడ్ లో ఫామ్ లోకి వస్తారు. అటు మెడిసిన్ చేస్తూనే, ఇటు సినిమాలు చేస్తున్న సాయి పల్లవి వయసు 27.

అనుపమ పరమేశ్వరన్ : ఇంకా స్టార్ హీరోయిన్ స్థాయి అందుకోలేదు కానీ, కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా అనగానే కన్సిడరేషన్ లో ఖచ్చితంగా అనుపమ పేరే ఉంటుంది. ఈమె వయసు జస్ట్ 23.

నయనతార : ఇండస్ట్రీలో హీరోలు ఎంత బిజీగా ఉంటారో… నయనతార కూడా అంతే బిజీ. అంతెందుకు స్టార్ హీరోల సినిమాల కోసం ఆడియెన్స్ ఎంతగా వెయిట్ చేస్తారో, నయనతార సినిమా కోసం అంతే ఈగర్ గా వెయిట్ చేస్తారు ఆడియెన్స్. 34 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం సక్సెస్ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తగా కరియర్ ప్లాన్ చేసుకుంటుంది నయనతార.

శృతిహాసన్ : యాక్టర్.. సింగర్… ఒక్క మాటలో చెప్పాలంటే మల్టీ ట్యాలెంటెడ్. ఈ మధ్య గ్యాప్ వచ్చిందనిపించినా రవితేజ సినిమాతో మళ్ళీ ట్రాక్ పైకి రానున్న శృతి హాసన్ వయసు 33.

హన్సిక మోత్వానీ :  ‘దేశముదురు’ సినిమా నాటికి జస్ట్ 14 ఏళ్ళు. అప్పుడే టాలీవుడ్ ని ఓ స్థాయిలో ఊపేసింది. ఈ మధ్య చిన్నగా స్పీడ్ తగ్గినా, చిన్నగా మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్న హన్సిక వయసు ప్రస్తుతం 28.

శ్రియ శరన్ : ‘ఇష్టం’ సినిమాతో పరిచయమై అందరూ ఇష్టపడేలా మెస్మరైజ్ చేసింది శ్రియ. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 37.