Ranga Ranga Vaibhavanga ఎట్రాక్ట్ చేస్తున్న వైష్ణవ్ తేజ్ -కేతిక

Thursday,September 01,2022 - 06:41 by Z_CLU

ఏ లవ్ స్టోరీ కయినా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం చాలా ముఖ్యం. వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయితే సినిమాలో లవ్ ట్రాక్ పండినట్టే. సినిమా సూపర్ హిట్ సాధించినట్టే. తాజాగా వైష్ణవ్ తేజ్ – కేతిక శర్మ మధ్య అలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఈ ఇద్దరూ కలిసి ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాలో వైష్ణవ్ -కేతిక మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని అంటున్నారు.

తాజాగా మీడియా ఇంటరాక్షన్ లో , ఇంటర్వ్యూలు ఇచ్చే టైంలో కూడా వీరు చాలా ఫ్రెండ్లీ గా ఉంటున్నారు. వీళ్ళ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ చూస్తుంటే సినిమాలో కచ్చితంగా లవర్స్ గా మెప్పించడం ఖాయమనిపిస్తుంది. రంగ రంగ వైభవంగా ఓ క్యూట్ లవ్ కం ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన సినిమా. ఇలాంటి సినిమాలకు హీరో -హీరోయిన్ మధ్య  కెమిస్ట్రీ పండితే సినిమా సూపర్ హిట్టైనట్టే.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ చూస్తుంటే వైష్ణవ్- కేతిక సినిమాకు హైలైట్ గా నిలవనున్నారని అనిపిస్తుంది. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ ని ఎట్రాక్ట్ చేయడం ఖాయమనిపిస్తుంది. అలాగే వీరిద్దరి మధ్య ఉండే ఇగో ఆడియన్స్ కి మంచి ఫన్ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. సో రిలీజ్ కి ముందే తమ కెమిస్ట్రీ తో ఎట్రాక్ట్ చేస్తున్న వైష్ణవ్ తేజ్ -కేతిక రిలీజ్ తర్వాత యాక్టర్స్ గా మంచి మార్కులు అందుకోవడం పక్కా అనిపిస్తుంది.

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics