Hari Hara Veeramallu రేపే పవర్ గ్లాన్స్

Thursday,September 01,2022 - 06:15 by Z_CLU

పవన్ కళ్యాణ్ హీరోగా,  క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు.  మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం  సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రేపు  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా స్పెషల్ విషెస్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

 రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, విజువ‌ల్ ఫీస్ట్‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా తెరకెక్కుతుంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ అని చెప్పొచ్చు. “ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా సినిమాను రూపొందిస్తున్నామని” మేకర్స్ చెప్తున్నారు. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటి వరకూ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు  అందిస్తుండ‌గా, సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా కె.ఎల్. ప్రవీణ్ పూడి, విఎఫ్ఎక్స్ హరి హర సుతన్, పోరాటాలు శామ్ కౌశల్, తడోర్ లజరొవ్ జుజి, రామ్ లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్ లు సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు.