7 కోట్ల వ్యూస్ సాధించిన సాంగ్ ఇది

Tuesday,June 16,2020 - 11:26 by Z_CLU

ఈ ఏడాది మ్యూజిక్ లవర్స్ ను బాగా అల‌రించిన పాట‌ల్లో ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ ఒక‌టి. దేవి శ్రీ‌ప్ర‌సాద్ కూర్చిన అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీల‌కు త‌న మ‌ధుర‌మైన గాత్రంతో జావెద్ అలీ జీవం పోశారు. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను మ‌రింత‌ ఆక‌ర్ష‌ణీయంగా మార్చేసింది.

తాజాగా ‘నీ కన్ను నీలి స‌ముద్రం’ పాట మ‌రో అరుదైన‌ మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌లో 7 కోట్ల‌ వ్యూస్‌ను దాటేసింది.

హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి.. ఇద్ద‌రికీ ఇదే తొలి చిత్ర‌మైన‌ప్ప‌టికీ ఈ పాట‌లో వారు ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

సంగీతంలో త‌న అభిరుచితో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. మ‌రో పాట ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ ఇప్ప‌టివ‌ర‌కూ 14 మిలియ‌న్ పైగా వ్యూస్ సాధించింది.

ద‌ర్శ‌క‌త్వంతో పాటు క‌థ‌, సంభాష‌ణ‌లు, స్క్రీన్‌ప్లేల‌ను కూడా బుచ్చిబాబు స‌మ‌కూర్చిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.