జీ సినిమాలు - జూన్ 16

Monday,June 15,2020 - 08:07 by Z_CLU

పదహారేళ్ల వయసు
నటీనటులు – చంద్రమోహన్, శ్రీదేవి
ఇతర నటీనటులు – మోహన్ బాబు, నిర్మలమ్మ
మ్యూజిక్ డైరెక్టర్ – చక్రవర్తి
డైరెక్టర్ – కె.రాఘవేంద్రరావు
రిలీజ్ డేట్ – 1978, ఆగస్ట్ 31
అతిలోకసుందరిని టాలీవుడ్ కు పరిచయం చేసిన సినిమా పదహారేళ్ల వయసు. అప్పటికే తమిళనాట సూపర్ హిట్ అయిన 16-వయతనిళ్లే సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. తమిళ్ లో ఈ సినిమాను కె.బాలచందర్ తీశారు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. రెండు భాషల్లో శ్రీదేవే లీడ్ రోల్ చేశారు. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్ పాత్రను చంద్రమోహన్ పోషించారు. అంతకంటే ముందు కమల్ హాసన్ పోషించిన పాత్రను శోభన్ బాబుకు, శ్రీదేవి క్యారెక్టర్ కోసం జయప్రదను అనుకున్నారు. కానీ వాళ్లిద్దరు బిజీగా ఉండడంతో చంద్రమోహన్-శ్రీదేవి ని ఫిక్స్ చేశారు. ఇక తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు పోషించారు.
చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలెట్. సిరిమల్లెపువ్వా అనే సాంగ్ ఇప్పటికీ హిట్టే. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ… తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ మార్చారు. తమిళ్ క్లయిమాక్స్ లో శ్రీదేవి రైల్వేస్టేషన్ లో ఒంటరిగా మిగిలిపోయినట్టు చూపించారు. కానీ తెలుగు క్లయిమాక్స్ లో మాత్రం చంద్రమోహన్ రాకతో సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది.

===================================

చక్రం
నటీనటులు : ప్రభాస్, అసిన్, ఛార్మి కౌర్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, రాధా కుమారి, నారాయణ రావు, కల్పన, పద్మనాభం తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : వెంకట రాజు, శివ రాజు
రిలీజ్ డేట్ : 25 మార్చి 2005
ప్రభాస్ హీరోగా నటించిన ‘చక్రం’ అటు ప్రభాస్ కరియర్ లోను ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ కరియర్ లోను చాల స్పెషల్ మూవీస్. ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి లు హీరోయిన్ లుగా నటించారు. లైఫ్ ఉన్నంత కాలం నవ్వుతూ బ్రతకాలనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చక్రం. చక్రి అందించిన సంగీతం సినిమాకే హైలెట్.

==========================

ఏబీసీడీ
నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్
ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ
డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
రిలీజ్ డేట్ : 17th మే 2019
న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.
అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.

===============================

ముత్తు
నటీనటులు : రజినీకాంత్, మీనా
ఇతర నటీనటులు : రఘువరన్, శరత్ బాబు, జయ భారతి, వడివేలు, కాంతిమతి, రాధా రవి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : K.S. రవికుమార్
ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్
రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తు, అతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=================================

రాఖీ
నటీనటులు : NTR, ఇలియానా, చార్మి
ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : K.L. నారాయణ
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006
NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================

బుర్రకథ
న‌టీనటులు: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి
ఇతర నటీనటులు : నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌థ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా,
అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు
సంగీతం : సాయికార్తీక్‌
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు
నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
రిలీజ్ డేట్: జూన్ 28, 2019
అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలా, మరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు.
రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు గురవుతుంటాడు అభిరామ్.
ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా).
ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరు? ఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయింది? హీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుంది? అసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.