పుష్ప అప్ డేట్: ముందుగా ఆట-పాట

Tuesday,June 16,2020 - 11:36 by Z_CLU

లెక్కప్రకారం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పుష్ప నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కావాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. పైగా షూటింగ్ పై కండిషన్స్ కూడా ఉన్నాయి. అందుకే పుష్ప యూనిట్ ప్లాన్ మార్చింది.

ముందుగా 40 మంది యూనిట్ తో ఇండోర్ లో షూట్ ప్లాన్ చేశారు. అది కూడా పాటలు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేశాడు. వాటిలో కొన్నింటిని బన్నీ-సుకుమార్ కలిసి ఫైనల్ చేశారు.

అలా ఫైనల్ చేసిన పాటలతో కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్. ఈలోగా పరిస్థితులు చక్కబడితే.. అప్పుడు ఔట్ డోర్ షూట్ పెట్టుకోవాలనేది ప్లాన్.

సినిమాకు సంబంధించి కేరళ అటవీప్రాంతంలో ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయింది. కాకపోతే అందులో బన్నీ లేడు. బన్నీ సెట్స్ పైకి వస్తున్న ఫస్ట్ షెడ్యూల్ ఇదే. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ మూవీలో పుష్ప అనే లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు బన్నీ.